Upanyasamulu    Chapters   

శ్రవణ, మనన, నిదిధ్యాసములు,

శ్రవణ మనన నిదిధ్యానముల చేయవలసినదని మన ఉ నిషత్తులు ఆజ్ఞాపించుచున్నవి. కాని మనము వానిని ఎందుకు చేయవలసియునో విచారించెదము:-

వాటిని మనము దర్శనముకొఱకు చేయవలయును. దర్శనముగానేమి? కంటితో చూచుటయే దర్శనమని మనకు అర్థము స్ఫురించుచున్నది. కాని అదికాదు. కంటికివేసుకొను అద్దముల ద్వారా చూచుపదార్థములు నిజమైనవిని చెప్పలేము. ఎఱ్ఱని పద్దము వేసుకొనిన పదార్థమెఱ్ఱగా కాన్పించును. నల్లని అద్దమును వేసుకొనిన నల్లగానుండును, పచ్చని అద్దములవేసుకొనిన పచ్చగానుండును. అందుచేత ఫలాని వస్తువుయొక్క స్వరూపము ఫలానిది అని స్పష్టముగ జెప్పలేము. ఆ విధముగా చూచినయెడల ప్రపంచమంతయు జెప్పలేము. ఆ విధముగా చూచినయెడల ప్రపంచమంతయు మిథ్య; అనగా సత్యమైనది కాదు. దీనికొక దృష్టాంతముకలదు.

ఇప్పడిక్కడ మన కగపడు దీపము మూరెడుపొడవు ఇంతలావు ఉన్నదని చెప్పుచున్నాము. దేనినిబట్టి మనమట్లు చెప్పుచున్నాము. కంటినిబట్టి. అనగా ఆపేక్షికమన్నమాట. అనగా ఇంద్రియ గోళకమునుబట్టి పదార్థము మారుచుండును. వాస్తవముగా చూచినట్లయిన ఆ దీపమునకు పొడవుగాని, లావుగాని ఏమియులేదు. లోకములో శుక్ల, నీల, పీత, కపిశ, హరిత, రక్త, చిత్రములని సప్తవిధరూపములున్నవి. మనమొక పదార్థమును శుక్లవర్ణముకలదానినిగా చెప్పుచున్నాము. మరి యొకడాపదార్థమునే పీత (పచ్చ) వర్ణముకలదని చెప్పును. అట్లనే సప్తవిధరూపముకూడాను. మనమొక శబ్దమును ఒక విధముగ వినుచున్నాము. ఆ శబ్దమునే మరయొకడు మరియొకవిధముగ వినుచున్నాడు. గ్రామఫోనుకు 'కీ' కొంచము తక్కువగానిచ్చిన శబ్దము తక్కవగానుండును. హెచ్చగానుండిన హెచ్చుగా నుండును. అంతియేగాని వాని యధార్థ్యస్వరమును వినుటలేదు కామలరోగికి ప్రపంచమంతయు పచ్చగనుండును. కాని రోగము లేని వాడువచ్చి నీవు చూచునది అబద్ధము అని చెప్పును. ఆ విధముగా చూచిన రూపరసగంధ యుక్తమగు ఈ ప్రపంచమంతయు మిథ్యాభూతమనయే చెప్పవలెను. కాబట్టి మనము మన కంటితో చూచుదర్శనము దర్శనమునిపించుకొనదు. దర్శనమనగా ఆత్మదర్శనమే దర్శనమే. అదే సత్యమైనది. కాబట్టి మనము సత్యమైనదానిచే చూడవలెను. అసత్యమగుదానిని ఎఁతచూచినను ప్రయోజనములేదు. వాపుతగ్గినగాని చేతియొక్క వాస్తవస్వరూపము తెలియనట్లు ఈ ప్రపంచము మిథ్య అను జ్ఞానము కలిగినగాని ఆ సత్యపదార్థము గోచరముకాదు. మురుగులు, కంటె, కాసులు, ఉంగరము, మొదలగు ఆభరణములు కన్నిటికిని బంగారము మూలకారణము. ఈ కుండలన్నిటికిని మృత్తిక అనగా మట్టి మూలకారణము. ఇది అందఱకును తెలిసినవిషయమే కాని ఆ మట్టికి, అట్లే బంగారునకు ఇంతయేల? సర్వప్రపంచమునకును మూలధారము అంటే మూలకారణ మొకటుండక తప్పదుగదా? ఆ వస్తువునకే ఆ తత్త్వమునకే పరమాత్మ అని పేరు. దానికింకొక కారణములేదు. మనమందఱుకూడా దానినే దర్శించవలసిందని వేదమాజ్ఞాపించుచున్నది.

అయిన మనము దానిని దర్శించుటెట్లు? అను ప్రశ్నవచ్చును. అందుకే మన శాస్త్రకారులు శ్రవణము, మననము నిదిధ్యానము, అను మూడుకారణములను చెప్పినారు. అనగా మనము వాటిని సాధించినట్లయిన ఆత్మ సాక్షాత్కారముకలిగితీరుతుంది. ఆత్మానందమును బొందవచ్చును. మనము కంటితో దీపమును జూచుచున్నాము. శబ్దమును చెవితో వినుచున్నాము రసమును నాలుకతో తెలిసికొనుచున్నాము. కాని ఆ ఆత్మపదార్థమును భిన్నమైనదనియే చెప్పవలెను. ఎందుపల్లననగా ఆ 'నేను' అను దానిలో కూడ కొన్ని దోషములున్నవి. వానిని తొలగించవలెను., అదేపరతత్వము. దానిని తెలిసికొనుటకు ఈ యింద్రియములలో నేదియును పనికిరాదు. కాని వేదవేమో శ్రవణమవసరమనుచున్నది- కాని శ్రవణమవసరమనగా అర్థమేమి? రాజుగారెక్కడో అంతఃపురమునందుండిన వాకిటిమెట్టు ఎటువంటిదో ఆత్మను తెలియుటకు శ్రవణమటువంటిది - పెద్దలగువారు శాస్త్రముల యందుండు నిషయములనే చెప్పెదరు-అప్పుడు మనము వానిని శ్రద్ధతో వినవలయును- దానికే శబ్దప్రమాణము, లేదా శ్రవణమనిపేరు-దీనికొకకథచెప్పెదను:-

ఒక గ్రామములో పెద్దరెడ్డిగారున్నారు. ఆయన పైరులు కోతకొచ్చినవి. పదిమంది కూలీలనుపిలచి కోతకాజ్ఞపించినాడు. సరే వీరందఱుకూడి పొలమువద్దకు బయలుదేరి పోవుచున్నారు. మధ్యేమార్గమున నది అడ్డమువచ్చినది. దానిని దాటినగాని వీరు గమ్యస్థానమును చేరలేరు. కాబట్టి నదిలోదిగి ఆవలిగట్టుచేరినారు. పదిమంది ఉన్నారోలేరో అను సందేహమొచ్చినది. లెక్కింప మొదలిడినారు. ప్రతివాడుకూడా తన్నువదలి తొమ్మిదిమందిని లెక్కజేసినాడు. పదియవవాడు ప్రవాహములో కొట్టుకొనిపోయినాడని ఏడ్వనారంభించినాడు. మరొకడు లెక్కింపనారంభించినాడు. వాడుకూడా తన్నువదలి తొమ్మిదిమందినిమాత్రము లెక్కపెట్టినాడు. పదియవవాడులేడని బోరున ఏడ్వనారంభించినాడు. పదియవవాడులేడే యజమానుడు శిక్షించునే అని అందరును దిగులుపడినారు. ఏమియుతోచలేదు. ఇంతలో మరియొకడు మార్గము పోవువాడొచ్చినాడు. ఏమిటి? మీరెందులకు విచారపడుచున్నారని అడిగినాడు. మేము పదిమందిమివచ్చితిమి. కాని ఒకడు నదిలోకొట్టుకొనిపోయినాడు అని చెప్పినారు. క్రొత్తగావచ్చినవాడు 'మీరుపదిమందియు ఉన్నారే' అని మరల లెక్కపెట్టమనినాడు. వారిలోనొకడు మరలాతన్నువదలి తొమ్మిదమందిని లెక్క పెట్టినాడు. పదియవవాడు లేడన్నాడు. అప్పుడు వాడు వనీవే పదియవాడవని తట్టిచెప్పినాడు.

దశమస్త్వమ్‌.

వారు సంతోషించారు. దుఃఖనివృత్తిఅయినది.

అయితే అది ఎట్లుతెలసినది? చెవిమూలకముననేగదా! అట్లనే ఆత్మ ఎక్కడనోలేదు. నీలోనేఉన్నది. కాని నీకు తెలియుటలేదు. ఇతరుడుచెప్పిన తెలియును. అందులకే మనశాస్త్రకారులు శ్రవణ మవసరమనిచెప్పినారు. వాస్తవముగా ఆత్మస్వరూపము ఈచెవితో, కన్నుతో తెలియబడునది కాకపోయినప్పటికిన్నీ ఈ శ్రవణము సహకారమౌను.

అందుకనేమనము ఆప్తులును, కామక్రోధాదులు లేనివారును. అగువారి పాదముల నాశ్రయించివారిమాటల శ్రవణముచేయవలెను. మన కెంతడబ్బు ఉండినప్పటికిన్నీ, బలముండినప్పటికినీ పలుకుబడిఉండినప్పటికిన్నీ, ఏదోఒక దుఃఖముతో కష్టపడుచునేయున్నాము. ఆ ఆనందస్వరూపమై వస్తువును తెలిసికొన్నట్లుయితే అప్పుడు ఏదుఃఖముకూడాలేదు. అందుకు శ్రవణమత్యమవసరము

శ్రవణముచేసినదానిని మనముచేయవలెను. అనగా మరల మరల నాలోచించవలెను. మతాంతరులు ఎన్నియుక్తులు చెప్పినను వానినెల్లనిరాకరించి దృఢనిశ్చయము చేసికొనవలెను. తరువాత అనుభవమునకు తెచ్చుకొనవలెను. మనకు ప్రతిరోజుకూడా కోటి కోటి దుశ్చింతలు కలుగుతున్నవి. వానిని మాన్పవలయునన్న ధ్యానమే సాధనము. అధ్యానమునకే నిదిధ్యాసమనిపేరు.

అభావనా నివర్తకము శ్రవణము.

అసంభావనా నివర్తకము మననము.

విపరీతభావనా నివర్తకము నిదిధ్యానము.

అభావన అనగా నీవుకాని ప్రపంచమును నీవనుకొనుచున్నావు. కాని దానినివడియగట్టన అదేపరమాత్మ. అదియే జ్ఞేయము. అటువంటితత్త్వము లేదనువారికి శ్రవణముఅవసరము. అట్లు శ్రవణముచేసినతరువాత అటువంటితత్వముండుటకు వీలున్నదా? అనుశంకగలవారికి మననము. అనగా శ్రవణముచేసినదానిని ఏకాంతమున పదేపదే చింతనచేయవలెను. తర్వాత దేహము నేను అనుభావముపోయి నేను పరమాత్మను అనుభావము రావలెను. నేను అనితలచిన పరమాత్మజ్ఞాపకమునకు రావలెను. అంతియెగాని అమేథ్యయుతమగు ఈశరీరముజ్ఞప్తికిరాకూడదు. అందుకు ధ్యానప్రవాహమవసరము. మన యోచనలంతయు దానికే విని యోగించవలెను. అధ్యానప్రవాహసంతతికే నిదిధ్యానమనిపేరు. ఇప్పుడు మనకాలమునంతయు నిరుపయోగములగు ప్రపంచకార్యములయందు వినియోగించుచున్నాము. అందుకనియేప్రపంచమున మనకింత దుఃఖము దృఢమగుచున్నది.

విపరీతభావనా నివర్తకమైన నిదిధ్యానమొనర్చిన మొదటిశ్రవణము నిలచును. ఆ దేదృఢజ్ఞానము. ఇప్పుడు మనము ఎన్ని యోపురాణములు వినుచున్నాము ఎన్నియో వేదాంతవాక్యముల వినుచున్నాము. ఎన్నియో ఉపన్యాసములు వినుచున్నాము కాని ఒకటికూడా అనుభవమున కొచ్చుటలేదు. కారణమేమి? విపరీతభావన అడ్డమున్నది. అది నశించవలెను. అందుకు శ్రవణముచేసినదానిని నిదిధ్యాసముచేయుట ముఖ్యము.

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం

భక్తిని చెప్పునప్పుడుకూడా మొదటశ్రవణ మవసరమని చెప్పినారు. పిదపకీర్తనము చేయవలెను. అందుకు ఓపికలేని పక్షమున స్మరణము. అనగా భగవన్నామమును పెద్దగజెప్పుటకశక్తుడైనచో మనస్సులో నైననుస్మరించుచుండవలయును. ఒకడికి పిచ్చిబట్టినది. మనస్సు నిలుకడలేదు. స్మరించుటకు సాధ్యము కాలేదు. అప్పడేమిచేయవలెను పాదసేవనము. అందుకుకూడ శక్తిలేనిపక్షమున అర్చనము అనగా పత్రపుష్ప ఫలాదులదెచ్చి మనస్ఫూర్తిగ ఆ భగవంతునకర్పింపవలెను. ఈ ప్రపంచమునగల వృక్షములను సృష్టించినదెవడు? పువ్వులను పూయించినది, కాయలను పండించునది ఎవడు? అంతయు ఆ పరమేశ్వరుడే కాబట్టి మనమందరమును ప్రేమపురస్సరముగా అతను సృష్టించిన వస్తువుల నతనికే అర్పింపవలెను. అదియే మన కర్తవ్యము. పిదప దాస్యమును చెప్పినారు. హనుమంతుడు శ్రీరామచంద్రునకు దాస్యమొనర్చి తరించినాడు. సఖ్యము, అనగా సమానము, అర్జునుడు శ్రీకృష్ణపరమాత్మతో స్నేహమొనర్చినాడు. కృతార్థుడైనాడు. కొట్టకొనది ఆత్మనివేదనము. అనగా మనసర్వము నతనికే అర్పింపవలెను. మన భార్య, బిడ్డలు, డబ్బు, పలుకుబడి ఇంతయేల సర్వముకూడా అతని సాక్షాత్కారమునకే వినియోగించివలెను. ఈ భార్యను. బిడ్డను, ప్రపంచమును భగవంతుడు నీ కెందుకిచ్చియున్నాడో తెలియునా? ఇవంతయు అనిని సాక్షాత్కారించుకొనుటకే. మనమాపదార్థముల ఉద్దేశ్యమును మఱచి మరొకవిధముగతలచి వినియోగించుచున్నాము. మనమేనాడు ఈ ప్రపంచమంతయు ఆ భగవంతుని సాక్షాత్కరించుటకే ఒసగబడినది అని తెలిసికొని ఆ పనికొఱకే వినియోగింతుమో నాడే మనము తరింతుము. అదియే మన కర్తవ్యము.

విపురీతభావన పోయినచో శ్రవణముచేత ముక్తివచ్చును. కేవలము శ్రవణముచేత ముక్తివచ్చునా? అని అనెదరేమో శుకమహర్షి పరిక్షిత్తునకు 7 దినములలో భాగవతమును వినిపించినాడు- మనముచేయుటకుకూడ-అవకాశములేదు- పరిక్షిత్తుతరించినాడు-మన దేహమునంది రోగముపోవలయునన్న గొప్పఔషధమును పుచ్చుకొనవలయును- కాని వైద్యుడు మందు వాడుటకుముందు దేహము శుద్ధిజెందుటకై విరేచనమునకిచ్చును-తర్వాత చికిత్సకారంభించును.- ఆ వధముగానే ప్రతి వారికికూడా మననము, నిదిధ్యానము ఈ రెండును చాల అవసరములు- ధ్యానముచేసినందులకు ఫలమేమి? ఈ దేహము నేను అను భావన పోవలెను-అట్లెప్పుడగుదుమో అప్పడు జ్ఞానము స్ఫురించును. అదియే సమాధి-

లయః తమశ్చ విక్షేపః రసాస్వాదశ్చ శూన్యతా.

సమాధికి లయము, తమస్సు, విక్షేపము, రసాస్వాదము శూన్యత అను 5 ప్రతిబంధకములుకలవు- వాటిని దాటవలెను- నిదిధ్యాసములో సవికల్పమని, నిర్వికల్పమని రెండవిధములున్నది. అవి రెండును పోవలెను. అంతవరకు రసాస్వాదము కలుగదు. రసాస్వాదమునగానేమి? అందులోకూడా రసమువేరు. దాని నాస్వాదించువాడువేరు అను భేద ఘటిత జ్ఞానముపోవలెను. రసమే నేను నేనే రసము అను భావమురావలెను. లయమనగా నిద్ర, సమాధిలో నిద్రవచ్చును. దానిని తెలుసుకొని నిరకారించవలెను. తమస్సనగా మోహము. దానినే ఆలస్యము, మత్తు అని చెప్పదరు. అనగా ముగ్ధబుద్ధి అని చెప్పవచ్చును. దానిని మానవలెను. విక్షేము-అనగా మన బుద్ధిలో ప్రతిక్షణముకూడా కోటి కోటి చిత్తవృత్తులు కలుగుచున్నవి. అవి రాకూడదు. వానివలన లాభములేదు. శూన్యతా-అనగా నిర్విషయము. అనగా చిత్తవృత్తిని నిర్విషయమొనర్పవలెను. మనవేదాంతశాస్త్రములో న, న, అనగా ఇదికాదు. ఇదికాదు అని నిషేధింప బడియున్నది. బౌద్ధులు ఆ నిషేధములను మాత్రము గైకొని చిత్తము నిర్విషముగ నుండుటయే సమాధి అని చెప్పినారు. వారు శూన్యమునే భావనచేసెదరు. కాని మనమేమిచేయవలెను? రసాస్వాదనచేయవసినదేకాని నేనాస్వాదించువాడను రసము వేరు అనుభావముపోయి నేనేరసము అను భావనచేయవలెను. మనస్సును ప్రపంచ విషయములనుండి నిర్విషయముగ చేయవలసినదేకాని బౌద్ధులవలె అంతటితో నూరకుండరాదు. తత్త్వమును మనస్సునకు విషయముగ చేసుకొనవలెను. తమస్సు అప్రయత్నముగా వచ్చును. శూన్యత ప్రయత్నముమీదవచ్చును. కాబట్టి మన మనస్సు ప్రపంచవిషయములనుండి శూన్యము కావలసినదేగాని బౌద్ధులు, యోగశాస్త్రకారులు చెప్పనట్లు తత్త్వమునుండికూడ నిర్విషయముకాగూడదు. 'దేహోహం' అనగా నేను దేహము అను భావనపోయి 'బ్రహ్మాహం' అనగా నేను బ్రహ్మమును అను తీవ్రభావమురావలెను. మన మానవజన్మకదియే సాధ్యము. ప్రతివారికిని బ్రహ్మాకారమగు చిత్తవృత్తి రావలెను. అప్పుడే మనమందరమును నిజమగు ఆనందము ననుభవింతుము.

Upanyasamulu    Chapters